నిధులు కేటాయించాలని వినతి
ఢిల్లీ – మంత్రి దాసరి సీతక్క ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా పలువురు మంత్రులను కలిశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల గురించి కేంద్ర మంత్రి అన్న పూర్ణ దేవితో చర్చించారు. తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు.
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పెండింగ్ లో ఉంచడం వల్ల చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం సకాలంలో అందించ లేక పోతున్నామని వాపోయారు. మంత్రి వెంట తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఫహీమ్ కూడా ఉన్నారు.
తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2025లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేశారని ఆవేదన చెందారు దాసరి సీతక్క. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. దేశంలోనే అత్యధికంగా జీఎస్టీ రూపంలో తమ రాష్ట్రం నుంచే అత్యధికంగా వస్తోందని తెలిపారు.
అయినా ఎందుకని వివక్ష చూపుతున్నారో తెలియడం లేదన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రికి ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరా విధానంగా గురించి వివరించారు చైర్మన్ ఫహీమ్. రాష్ట్ర ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారు అన్న పూర్ణా దేవి.