బాధిత కుటుంబానికి భరోసా
మంత్రులు సీతక్క..శ్రీధర్ బాబు
పెద్దపల్లి జిల్లా – పెద్దపల్లి జిల్లాలోని ఓ రైస్ మిల్లులో అత్యాచారానికి , హత్యకు గురైన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు రాష్ట్ర మంత్రులు దాసరి సీతక్క, శ్రీధర్ బాబు. మంత్రులతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరామర్శించారు.
బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తామన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. డ్రగ్స్ , గంజాయి వల్లనే ఇలాంటి ఘోరాలు చోటు చేసుకుంటున్నాయని వాపోయారు సీతక్క, శ్రీధర్ బాబు.
తక్షణ సహాయంగా రెండున్నర లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. మిల్లు యాజమాన్యం నుంచి మరో ఐదు లక్షలు ఇప్పిస్తామన్నారు. ఇందిరమ్మ పథకం కింద ఇల్లుతో పాటు ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు మంత్రులు.
బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నేరస్థుడిని అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించేలా చేస్తామన్నారు. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి.. పడుకున్న పాపను ఎత్తుకు పోయి రేప్ చేసి చంపడం కలచి వేసిందన్నారు.