మొక్కుకున్న సీతక్క
ములుగు జిల్లా – ప్రపంచంలోనే అతి పెద్ద జన జాతరగా భావించే మేడారం సమ్మక్క సారలమ్మల ను కొలిచేందుకు , తమ మొక్కును తీర్చేందుకు భక్తులు బారులు తీరారు. కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచి పోయాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆద్వర్యంలో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఏ ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశించారు. ఈమేరకు కీలక మంత్రులుగా ఉన్న దాసరి సీతక్క, కొండా సురేఖలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మేడారంకు వెళ్లలేని భక్తులు ఎవరైనా ఉంటే తమ మొక్కులు తీర్చుకునేందుకు నిత్యం సమ్మక్క సారలమ్మలకు సమర్పించే బంగారాన్ని ఆన్ లైన్ లో సమర్పించుకునే సౌకర్యాన్ని కల్పించింది. దీనిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఇక ఇవాళ ఆదివారం కావడంతో మేడారం సముద్రాన్ని తలపింప చేసింది. ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత భక్త జనం తరలి వచ్చారు తండోప తండాలుగా. మంత్రి దాసరి సీతక్క మొక్కును తీర్చుకున్నారు.