NEWSTELANGANA

శిల్పం కాదు ఆత్మ గౌర‌వ ప‌తాకం

Share it with your family & friends

బీఆర్ఎస్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం కాద‌ని అది కాంగ్రెస్ పార్టీకి చెందిన త‌ల్లి అంటూ మండిప‌డ్డారు.

తెలంగాణ చ‌రిత్ర‌ను చెరిపేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ఆరోపించారు. ఓ శాడిస్టు లాగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, స‌రైన స‌మ‌యంలో షాక్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌న్నారు.

తెలంగాణ తల్లి విగ్రహం అంటే కేవలం శిల్పం కాదని, అది ఉద్యమ చరిత్ర, ఆత్మ గౌరవానికి నిదర్శనం అన్నారు దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్. విగ్రహాన్ని మార్చ‌డం ద్వారా ఉద్య‌మానికి చెందిన చ‌రిత్ర ను చెరిపి వేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని వాపోయారు దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్.

ఒక ర‌కంగా ఘ‌న‌మైన చ‌రిత్ర క‌లిగిన తెలంగాణ‌ను అప‌హాస్యం చేయ‌డం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. రేవంత్ రెడ్డి ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు శాడిస్టు, సైకోపాత్ లాగా ఉంద‌న్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం సింహాల రూపాన్ని మార్చినప్పుడు రాహుల్ గాంధీ స్పందించారని, మ‌రి ఇప్పుడు తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని మార్చితే ఎందుకు నోరు విప్ప‌డం లేదంటూ ప్ర‌శ్నించారు .

తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అనేది ప్రజల నమ్మకాన్ని దెబ్బ తీయడమే కాదు, ఉద్యమ ఆత్మ ప్రతిబింబానికి గాయమిచ్చే ప్రయత్నం చేయ‌డం అన్నారు దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ చిల్లర నిర్ణయాలను ప్రజలు సహించరని గుర్తు పెట్టుకోవాల‌న్నారు. అస‌లు సీఎంకు ఉద్య‌మ చ‌రిత్ర నేప‌థ్యం లేద‌ని, అందుకే ఇలా చేస్తున్నాడంటూ మండిప‌డ్డారు.