మేం వివరాలిస్తే సీఎంగా నువ్వెందుకు
నిప్పులు చెరిగిన దాసోజు శ్రవణ్ కుమార్
హైదరాబాద్ – బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ నిప్పులు చెరిగారు. బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం వివరాలు ఇస్తే నువ్వు ఎందుకు సీఎంగా ఉండడం దండుగ అని పేర్కొన్నారు.
200 మంది రైతులు చని పోయారని తాము ఇప్పటికే ప్రకటించామని ఈ విషయం గురించి తెలుసు కోవాల్సింది పోయి మీరు వివరాలు ఇవ్వమని కోరడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తాము ఎందుకు ఇవ్వాలని నిలదీశారు. విచిత్రం ఏమిటంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందని, నిద్ర పోతోందా అని మండిపడ్డారు.
పాలన పడకేసిందని సీఎంగా రేవంత్ రెడ్డి అనర్హుడని పేర్కొన్నారు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్. మాటలు కొండంత చేతలు గొరంత మాత్రమే ఉందంటూ ఎద్దేవా చేశారు. మరి రేవంత్ రెడ్డి ఏం పీకుతున్నావంటూ సంచలన కామెంట్స్ చేశారు. సీఎంగా ఉంటూ ఇప్పటి దాకా ఏం చేశావో ప్రజలకు తెలియ చేయాలని డిమాండ్ చేశారు .