డేవిడ్ వార్నర్..పృథ్వీ షాకు షాక్
మయాంక్ అగర్వాల్ కు నో ఛాన్స్
జెడ్డా – ఐపీఎల్ మెగా వేలం పాట ముగిసింది. మొత్తం 183 ప్లేయర్లను 639 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. అత్యధిక ధరకు పంత్ అమ్ముడు పోతే బీహార్ యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్య వంశీ రూ. 1 కోటి 10 లక్షలకు అమ్ముడు పోయాడు. ఇది రికార్డ్.
ఎవరూ ఊహించని రీతిలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ , పృథ్వీ షా తో పాటు మయాంక్ అగర్వాల్ వైపు ఫ్రాంచైజీలు పట్టించు కోలేదు. వారు అన్ సోల్డ్ (అమ్ముడు పోని ) ఆటగాళ్ల జాబితాలో చేరి పోయారు.
వీరే కాదు కేన్ విలియమ్సన్ కూడా ఉన్నాడు.
అమ్ముడు పోని ఆటగాళ్లలో వారి బేస్ ప్రైజ్ ఇలా ఉంది. వార్నర్ రూ. 2 కోట్లు, అన్మోల్ ప్రీత్ సింగ్ రూ. 30 లక్షలు, యష్ ధుల్ రూ. 30 లక్షలు, కేన్ విలియమ్సన్ రూ. 2 కోట్లు, మయాంక్ రూ. 1 కోటి, షా రూ. 75 లక్షలు, సర్ఫరాజ్ ఖాన్ రూ. 75 లక్షలు , కౌశిక్ రూ. 30 లక్షలు, ఫుక్ రాజ్ మన్ రూ. 30 లక్షలు, ఫిన్ అలెన్ రూ . 2 కోట్లు, బ్రీవిస్ రూ. 75 లక్షలు, బెన్ డకెట్ రూ. 2 కోట్లు, బ్రాండన్ కింగ్ రూ. 75 లక్షలు, పాతుమ్ నిస్సాంక రూ. 75 లక్షలు, స్టీవ్ స్మిత్ రూ. 2 కోట్లు, సచిన్ దాస్ రూ. 30 లక్షలు, సల్మాన్ నిజార్ రూ. 30 లక్షలు , ల్యూస్ డు పూయ్ రూ. 50 లక్షలు, శివాలిక్ శర్మ రూ. 30 లక్షలు పలికారు. కానీ వీరంతా అన్ సోల్డ్ ఆటగాళ్లుగా మారారు.