ఢిల్లీ కమాల్ లక్నో ఢమాల్
6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ కు బిగ్ షాక్ తగిలింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగింది ఈ మ్యాచ్. ముందుగా బ్యాటింగ్ కు దిగిన లక్నో 168 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది.
అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 18.1 ఓవర్ లోనే టార్గెట్ ను పూర్తి చేసింది. జయ కేతనం ఎగుర వేసింది. యువ క్రికెటర్ ప్రేసర్ దుమ్ము రేపాడు. కేవలం 35 బాల్స్ మాత్రమే ఎదుర్కొని 55 రన్స్ చేశాడు. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో 2 ఫోర్లు 5 భారీ సిక్సర్లు ఉన్నాయి.
ఇక కెప్టెన్ రిషబ్ పంత్ 24 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 2 సిక్సర్లతో 41 రన్స్ చేశాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక లక్నో విషయానికి వస్తే ఆయుష్ బదోనీ సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 35 బంతుల్లో 55 రన్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 రన్స్ చేసింది. ఇక లక్నోను కట్టడి చేయడంలో దుమ్ము రేపిన కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.