ముంబైకి ఢిల్లీ బిగ్ షాక్
పాండ్యా సేన విల విల
న్యూడిల్లీ – ఐపీఎల్ 2024లో బ్యాటర్ల హవా కొనసాగుతోంది. నిన్న పంజాబ్ కింగ్స్ దుమ్ము రేపితే శనివారం జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ఢిల్లీలో జరిగిన కీలక లీగ్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ సాధించింది. పరుగుల వరద పారింది మైదానంలో.
జేక్ ఫ్రేజర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్లతో హోరెత్తించాడు. షాయ్ హోప్ దంచి కొట్టాడు. ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. గ్రౌండ్ మొత్తం షాట్స్ తో అలరించారు ఈ ఇద్దరూ. స్టబ్స్ , పంత్ లు ధనా ధన్ ఇన్నింగ్స్ ఆడారు. హోప్ 41 రన్స్ చేస్తే , స్టబ్స్ 48 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. పంత్ 29 రన్స్ చేశాడు.
తొలి వికెట్ కు 114 రన్స్ జోడించారు. కేవలం 27 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు 6 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. స్టబ్స్ 18 వ ఓవర్ లో 5 ఫోర్లు ఒక సిక్సర్ కొట్టాడు. ఇక ఆఖరున వచ్చిన పటేల్ 11 రన్స్ చేశాడు. మొత్తంగా 257 భారీ స్కోర్ సాధించి ముంబైకి షాక్ ఇచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్.