SPORTS

ఢిల్లీ చేతిలో ముంబై ఓట‌మి

Share it with your family & friends

పోరాడి ఓడిన ఇండియ‌న్స్

న్యూఢిల్లీ – ఐపీఎల్ 2024లో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ దెబ్బ‌కు ముంబై చేతులెత్తేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 257 ర‌న్స్ చేసింది. బేక్ ఫ్రేజ‌ర్ సూప‌ర్ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు.

మైదానం అంత‌టా క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆక‌ట్టుకున్నాడు. 11 ఫోర్లు 6 సిక్స‌ర్లు కొట్టాడు. 84 ప‌రుగులు చేశాడు. అత‌డు ఎదుర్కొన్న‌ది కేవ‌లం 25 బంతులు మాత్ర‌మే. తిల‌క్ వ‌ర్మ చేసిన ఒంట‌రి పోరాటం వృధాగా మారింది. దీంతో 10 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైంది.

స్ల‌బ్స్ అంతే బంతులు ఎదుర్కొన్నా 48 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. వీరికి తోడు హోప్ 41 రన్స్ తో రాణించాడు. అనంత‌రం భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ చివ‌రి దాకా పోరాడింది.

తిల‌క్ వ‌ర్మ 32 బాల్స్ ఎదుర్కొని 4 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో 63 ర‌న్స్ చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 46 ప‌రుగులు చేశాడు. ఈ టోర్నీలో ఆశించిన మేర విజ‌యాన్ని అందుకోలేక పోయింది. వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఆ జ‌ట్టుకు బిగ్ సాక్ త‌గిలింది ఢిల్లీ రూపంలో.