కృనాల్ పాండ్యా ఆల్ రౌండ్ షో
న్యూఢిల్లీ – ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో దుమ్ము రేపింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. స్వంత గడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ కు చుక్కలు చూపించింది. కృనాల్ పాండ్యా ఆల్ రౌండ్ షోతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. థ్రిల్లింగ్ విక్టరీతో ప్రత్యర్థికి షాక్ ఇచ్చింది. పాయింట్ల పట్టికలో 7 విజయాలు సాధించి 14 పాయింట్లతో టాప్ లో నిలిచింది. ప్లే ఆఫ్స్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 162 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాండ్యా 47 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 3 సిక్సర్లతో 73 రన్స్ చేశాడు.
కోహ్లీ 47 బంతుల్లో 51 రన్స్ చేశాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 33 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. హాజిల్ వుడ్ 36 పరుగులు ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. అంతకు ముందు స్వంత గడ్డపై భారీ స్కోర్ సాధించాలని అనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు బెంగళూరు బౌలర్లు చుక్కలు చూపించారు. 8 వికెట్లు కోల్పోయి తక్కువ స్కోర్ కే పరిమితమైంది. కేఎల్ రాహుల్ ఒక్కడే 39 బంతులు ఎదుర్కొని 41 రన్స్ చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ 18 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఓ సిక్స్ ఉంది.