అందరూ పార్టీలోనే పార్టిసిపేట్
హైదరాబాద్ – రాడిసన్ బ్లూ పబ్ లో చోటు చేసుకున్న డ్రగ్స్ వ్యవహారంపై రోజు రోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాను కలిసేందుకు మాత్రమే వెళ్లానని, డ్రగ్స్ తీసుకోలేదంటూ స్పష్టం చేశారు దర్శకుడు క్రిష్. అయితే తను కూడా డ్రగ్స్ పార్టీలో ఉన్నాడని సంచలన విషయం బయట పెట్టారు మాదాపూర్ డీసీపీ వినీత్. ఆయన మీడియాతో మాట్లాడారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు.
డ్రగ్ పెడలర్ అబ్బాస్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 10 సార్లు గజ్జల వివేకానందకు అబ్బాస్ కొకైన్ డెలివరీ చేశాడని తెలిపారు. లిషి, శ్వేత, సందీప్ పరారీలో ఉన్నారని చెప్పారు డీసీపీ. చరణ్ బెంగళూరులో ఉన్నాడని, ఆ పార్టీలో డైరెక్టర్ కూడా పార్టిసిపేట్ చేశాడని, ఆయనను కూడా విచారణ చేపడతామని స్పష్టం చేశారు.
తమ విచారణకు వస్తానని తెలిపారని పేర్కొన్నారు. వివేకా నంద, కేదార్, నిర్భయ్ కొకైన్ సేవించినట్లు తెలిసిందన్నారు. మిగిలిన వాళ్ళు సేవించార లేదా అని పరీక్షలు చేసి నిర్ధరిస్తామన్నారు డీసీపీ. అబ్బాస్ మంజీర గ్రూప్ లో గతంలో పని చేశాడని చెప్పారు. వివేకానంద ఆర్డర్ మేరకు అబ్బాస్ సప్లయ్ చేశాడని అన్నారు. ఇప్పుడే విచారణ చేపట్టామని, రిమాండ్ రిపోర్టులో అన్ని విషయాలు బయట పెడతామన్నారు.