ప్రకటించిన డీసీపీ వినీత్ గంగన్న
హైదరాబాద్ – మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ విషయంలో కీలక అప్ డేట్ ఇచ్చారు హైదరాబాద్ డీసీపీ వినీత్ గంగన్న. నిన్న గచ్చిబౌలి లోని ప్రిజం పబ్ లో ఎవరికీ తెలియకుండా అటెండ్ కావడంతో విశ్వసనీయ సమాచారం మేరకు అటాక్ చేశామన్నారు. ఇదే సమయంలో కాల్పులకు తెగబడ్డాడని, ఈ ఘటనలో తమ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికి గాయమైందని, ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు చెప్పారు.
ఆదివారం డీసీపీ వినీత్ గంగన్న మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు. గత కొంత కాలంగా బత్తుల ప్రభాకర్ కు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. గాలింపు చర్యలను ముమ్మరం చేశామని చెప్పారు.
ఇదే సమయంలో తమకు సమాచారం అందడంతో అక్కడికి ముందస్తుగా వెళ్లామని, అదును చూసి తాము వచ్చామని తెలుసుకుని తమపై కాల్పులు జరిపాడని అన్నారు. కాగా బత్తుల ప్రభాకర్ మీద 80కి పైగా కేసులు ఉన్నాయని , మిస్సింగ్ కేసులే ఇందులో ఎక్కువని చెప్పారు. తన నుంచి ఉన్న వెపన్స్ ను స్వాధీనం చేసుకున్నామని, సీజ్ చేశామని స్పష్టం చేశారు డీసీపీ.