Monday, April 21, 2025
HomeNEWSNATIONALఆధార్ ఫ్రీ అప్‌డేషన్‌కు గ‌డువు పెంపు

ఆధార్ ఫ్రీ అప్‌డేషన్‌కు గ‌డువు పెంపు

యూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా

ఢిల్లీ – దేశంలోని ఆధార్ కార్డుదారుల‌కు తీపి క‌బురు చెప్పింది కేంద్రం. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ నుంచి కీలక ప్రకటన చేసింది. దేశంలో ఆధార్ ఫ్రీ అప్‌డేషన్‌కు సంబంధించి డిసెంబ‌ర్ 15 వ‌ర‌కు గ‌డువు విధించింది.

దీంతో ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున విన‌తులు రావ‌డంతో పాటు ప్ర‌జా ప్ర‌తినిధులు, ఎంపీల నుంచి కూడా గ‌డువు పెంచాల‌ని కోర‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం ఓకే చెప్పింది. ఈ మేర‌కు గడువు పొడిగించాల‌ని ఆదేశించింది .

ఇందుకు సంబఃధించి యూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే ఏడాది 2025 జూన్ 14వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఈ అరుదైన అవ‌కాశాన్ని ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments