ప్రజా ప్రభుత్వ పాలన భేష్
దీపా దాస్ మున్షీ కామెంట్స్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు రాజకీయ పరంగా అపారమైన అనుభవం ఉంది. అందుకే యంగ్ , డైనమిక్ లీడర్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి మరింత తోడ్పాటుగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె నిత్యం కీలకంగా మారారు. అయితే ప్రభుత్వ కార్యక్రమాలలో దీపా దాస్ మున్షీ పాల్గొనడం అప్రజాస్వామికమని భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు రాకేశ్ రెడ్డి ఆరోపించారు. అయినా వాటిని పక్కన పెట్టి పౌర సమాజంతో పాటు మేధావులు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతలతో భేటీ అయ్యారు.
ఈ సందర్బంగా పౌర సమాజం నుంచి వచ్చిన సూచనలు, సలహాలు తాను నోట్ చేసుకున్నానని, వీటిని సాధ్యమైనంత మేర ప్రభుత్వంతో మాట్లాడి చక్కదిద్దే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం దీపా దాస్ మున్షీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అంటే ప్రజల భాగస్వామ్యమని , వారిని కాదని మనం ఎక్కడికీ వెళ్లలేమన్న సత్యాన్ని రాజకీయ నాయకులు గుర్తించాలని హితవు పలికారు. మేధావులు, బుద్ది జీవులు, నేతలు ఇచ్చిన సలహాలు, సూచనలు అత్యంత విలువైనవని , వాటిని తాను అర్థం చేసుకున్నానని తెలిపారు.