దీపికా పదుకొనే దిల్జిత్ దోసాంజ్ వైరల్
బెంగళూరు కచేరిలో సెన్సేషన్
బెంగళూరు – ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే , పాప్ పంజాబ్ సింగర్ దిల్జిత్ దోసాంజే వైరల్ గా మారారు. బెంగళూరు వేదికగా మ్యూజిక్ కన్సర్ట్ (కచేరి) జరిగింది. భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు పదుకొనే.
ఈ ప్రోగ్రాంకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్బంగా దీపికా పదుకొనే పాప్ గాయకుడికి స్టేజి పైనే కన్నడ నేర్పించింది. అంతే కాకుండా దిల్జీత్ పాడిన పాటలకు ఉర్రూత లూగి పోయారు ఫ్యాన్స్. దిల్జీత్ ను కౌగిలించుకుంది దీపికా పదుకొనే.
అంతే కాదు దిల్జీత్ కలిసి డ్యాన్సు చేసింది, హోరెత్తించింది. తనకు కన్నడలో మాటలు నేర్పించడంపై థ్యాంక్స్ తెలిపారు పాప్ సింగర్.
“కిత్నా పయారా ఇన్హోనే కామ్ కియా హై. హమ్నే ఇంకో బడే పర్దే పర్ దేఖా హై. కభీ సోచా నా థా కీ ఇత్నీ పాస్ సే దేఖ్నే కో మిలేంగే. ఇత్నే ప్యారే ఔర్ అప్నే దమ్ పే జిన్హోనే జగహ్ మేబనై అంటూ పేర్కొన్నాడు దిల్జీత్ దోసాంజే.
దీపికా పదుకొనేను సినీ తెరపై చూశానని, కానీ ఇంత దగ్గరగా చూస్తానని అనుకోలేదన్నారు దీపికా పదుకొనే గురించి. దీపికా పదుకొనే స్వస్థలం కర్ణాటక. తన తండ్రి ప్రపంచంలో పేరు పొందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనే, తల్లి దివ్యా పడుకొనే.