SPORTS

ఢిల్లీ క్యాపిట‌ల్స్ తుది జ‌ట్టు ఇదే

Share it with your family & friends

కీల‌క ఆట‌గాళ్ల‌పై గంగూలీ ఫోక‌స్

ఢిల్లీ – ఢిల్లీ క్యాపిట‌ల్స్ కీల‌క‌మైన ఆట‌గాడైన రిష‌బ్ పంత్ ను పోగొట్టుకుంది. త‌ను ఆ జ‌ట్టుకు 9 ఏళ్ల పాటు ఆడాడు. ఇదే స‌మ‌యంలో ఐపీఎల్ హిస్ట‌రీలోనే అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయాడు. ల‌క్నో వ‌దిలి వేసిన కేఎల్ రాహుల్ ను ఢిల్లీ భారీ ధ‌ర‌కు తీసుకుంది. త‌న‌ను రూ. 11 కోట్లు పెట్టి చేజిక్కించుకుంది. అత‌డితో పాటు మ‌రో కీల‌క ఆట‌గాడు మిచెల్ స్టార్క్ ను రూ. 11. 75 కోట్ల‌కు చేజిక్కించుకుంది.

కెప్టెన్ గా పంత్ స్థానంలో రాహుల్ ను భ‌ర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఈ జ‌ట్టుకు సౌర‌వ్ గంగూలీ మెంటార్ గా ఉన్నాడు. ఆస్ట్రేలియన్ ప్రాడిజీ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్‌ను రూ. 9 కోట్లకు తీసుకుంది. ఇంగ్లీష్ బ్యాట‌ర్ హ్యారీ బ్రూక్ ను రూ. 6.25 కోట్ల‌కు, భార‌త పేస‌ర్ టి. న‌ట‌రాజ‌న్ ను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిట‌ల్స్. త‌న‌ను రూ. 10.75 కోట్లు వెచ్చించింది. వెట‌ర‌న్ క్రికెట‌ర్ క‌రుణ్ నాయ‌ర్ ను రూ. 50 ల‌క్ష‌లకు తీసుకుంది.

దేశీయ స్టార్లు స‌మీర్ రిజ్వీ ని రూ. 95 ల‌క్ష‌లు, అశు తోష్ శ‌ర్మ ను రూ. 3.80 కోట్లు, పేస‌ర్ మోహిత్ శ‌ర్మ‌ను రూ. 2.20 కోట్ల‌కు తీసుకుంది ఢిల్లీ క్యాపిట‌ల్స్. పేసర్ ముఖేష్ కుమార్‌ను రూ. 8 కోట్లకు త‌న వ‌ద్దే ఉంచుకుంది. మునుప‌టి సీజ‌న్ లో 10 మ్యాచ్ ల‌లో 17 వికెట్లు తీసుకున్నాడు.

స్టార్క్, న‌ట‌రాజ‌న్ , మోహిత్ , ముఖేష్ పేస్ అటాక్ కు ప‌నికి వ‌స్తారు. ఈ సారి జ‌ట్టు కూర్పు కూడా బాగుంది.