NEWSNATIONAL

సోనమ్ వాంగ్ చుక్ అరెస్ట్ అక్ర‌మం – ఆప్

Share it with your family & friends

ముఖ్య‌మంత్రి అతిషి..సిసోడియా ఆగ్ర‌హం

ఢిల్లీ – ప్ర‌ముఖ ప‌ర్యావర‌ణ ప్రేమికుడు, ల‌డ‌ఖ్ ప్రేమికుడు సోన‌మ్ వాంగ్ చుక్ తో పాటు 120 మందికి పైగా ల‌డ‌క్ వాసుల‌ను ఢిల్లీ స‌రిహ‌ద్దులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తీవ్ర వ్య‌క్తం అవుతోంది దేశ వ్యాప్తంగా. దీంతో విష‌యం తెలుసుకున్న వెంట‌నే సోన‌మ్ వాంగ్ చుక్ ను ప‌రామ‌ర్శించేందుకు పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు వెళ్లారు ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అతిషి సింగ్ తో పాటు మ‌నీష్ సిసోడియా.

ఈ సంద‌ర్బంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సిసోడియా. ‘పీఎం మోదీ, అమిత్ షా, బీజేపీ ఏం చేస్తున్నారో నాకు తెలియడం లేదు. బీజేపీ వారికి పూర్తి రక్షణ కల్పించినందున గ్యాంగ్‌స్టర్లను పట్టుకోవడం లేదు. .కానీ జాతి సమస్యలను లేవనెత్తే సోనమ్ వాంగ్‌చుక్ లాంటి వారు పాదయాత్ర చేయాలనుకుంటే వారిని ఉగ్రవాదులుగా ఎందుకు చూస్తున్నారు?…అని సీరియస్ అయ్యారు.

ఇదిలా ఉండ‌గా సోన‌మ్ వాంగ్ చుక్ ను క‌లిసేందుకు వెళ్లిన సీఎం అతిషిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు పోలీసులు. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

“లడఖ్ ప్రజలు రాష్ట్ర హోదాను కోరుకుంటున్నారు. సోనమ్ వాంగ్‌చుక్ తో పాటు ల‌డ‌క్ వాసులు బాపు స‌మాధిని సంద‌ర్శించి , నివాళులు అర్పించాల‌ని అనుకున్నార‌ని, వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకుంటే ఎలా అని ప్ర‌శ్నించారు.

వారు నన్ను సోనమ్ వాంగ్‌చుక్‌ను కలవనివ్వలేదు. ఇది బిజెపి నియంతృత్వం. మేము సోనమ్‌కు పూర్తిగా మద్దతు ఇస్తున్నామమ‌ని ప్ర‌క‌టించారు.