ప్రధాని ఎవరనేది ప్రకటిస్తాం
భారత కూటమిదే గ్రాండ్ విక్టరీ
న్యూఢిల్లీ – ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం దేశ వ్యాప్తంగా 17వ విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4న తుది ఫలితాలు రానున్నాయి. ఈసారి భారత కూటమిదే విజయం సాధించ బోతోందని స్పష్టమైందని పేర్కొన్నారు అరవింద్ కేజ్రీవాల్.
న్యూఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే నివాసంలో భారత కూటమి ఆధ్వర్యంలోని ప్రతిపక్షాల నేతలు హాజరయ్యారు. ఈ కీలక సమావేశంలో తుది ఫలితాలపై ప్రత్యేకంగా చర్చించారు. సమావేశం అనంతరం ఢిల్లీ సీఎం మీడియాతో మాట్లాడారు.
దేశ ప్రజలు నిరంకుశత్వానికి, నియంతృత్వానికి చెంప చెల్లుమనేలా తీర్పు ఇవ్వ బోతున్నారని, ఇండియా కూటమికి 295 సీట్లు రానున్నాయని జోష్యం చెప్పారు. పూర్తి ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధానమంత్రి ఎవరనేది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్.