అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు
ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఎంను కేంద్ర దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. ఆయనను జైలుకు తరలించాయి.
ఇదిలా ఉండగా ఎన్నికల్లో తాను స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నానని, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు అరవింద్ కేజ్రీవాల్. దీనిపై విచారించిన కోర్టు కొన్ని రోజుల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
తాను రోగ పీడితుడినని, కొన్ని పరీక్షలు చేసుకోవాల్సి ఉందని తనకు బెయిల్ మంజూరు చేయాలని మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఇవాళ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేసింది . లక్ష రూపాయల పూచీ కత్తుతో అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం బయటకు రానున్నారు.