ఢిల్లీ ఎన్నికల్లో అత్యల్ప నమోదు శాతం
ఢిల్లీ – ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి ఎన్నికల్లో 100 మంది మహిళలు బరిలో నిలిచారు. ఇందులో కేవలం5 మంది అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. మొత్తం 70 స్థానాలకు గాను 699 మంది పోటీ చేశారు. బీజేపీ 50 సీట్లలో గెలుపొందగా 20 సీట్లలో ఆప్ విజయం సాధించింది. బీజేపీ నుంచి నలుగురు విజయం సాధించగా ఆప్ నుంచి ఒకే ఒక్కరు అతిశి గెలుపొందారు. గత 10 ఏళ్లలో ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం.
గత దశాబ్దంలో ఢిల్లీ అసెంబ్లీలో అత్యల్ప మహిళా ప్రాతినిధ్యం ఇదే. గెలుపొందిన వారిని చూస్తే అతిషి మర్లేనా ఆప్ నుంచి బరిలో నిలిచారు. ఆమె కల్కాజీ నియోజకవర్గం నుంచి 3,521 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన రమేష్ బిధురిని ఓడించారు.
షాలిమార్ బాగ్ స్థానం బీజేపీ వశమైంది. రేఖా గుప్తా తన ఆప్ అభ్యర్థి బందన కుమారిని 29 వేల 595 ఓట్లతో ఓడించారు. వజీర్ పూర్ లో పూనమ్ శర్మ ఆప్ కు చెందిన రాజేష్ గుప్తాను 11 వేల 425 ఓట్ల తేడాతో గెలుపొందారు.
నజాఫ్ గఢ్ నుంచి పోటీ చేసిన నీలం పహల్వాన్ తన సమీప ప్రత్యర్థి ఆప్ కి చెందిన తరుణ్ కుమార్ ను 29 వేల 9 ఓట్లతో ఓడించారు. ఇక గ్రేటర్ కైలాష్ నియోజకవర్గాన్ని బీజేపీకి చెందిన శిఖా రాయ్ కైవసం చేసుకున్నారు. తన సమీప ప్రత్యర్థి సౌరభ్ భరద్వాజ్ ను 3 వేల 188 ఓట్ల తేడాతో ఓడించింది.