నిప్పులు చెరిగిన సామాజివేత్త అన్నా హజారే
మహారాష్ట్ర – ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే నిప్పులు చెరిగారు. పార్టీపై, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చాడని, ఆప్ ఫక్తు రాజకీయ పార్టీగా మారి పోయిందన్నారు. శనివారం అన్నా హజారే మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు దేనినైనా సహిస్తారు కానీ అవినీతిని సహించరని స్పష్టం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ మరో నియంత లాగా ప్రవర్తించాడని, తానే అన్నీ అయినట్లు వ్యవహరించాడని ధ్వజమెత్తారు. ఆప్ సామాన్యుల కోసం పనిచేయాల్సింది పోయి చివరకు కార్పొరేటర్లకు, వ్యాపారవేత్తలకు వత్తాసు పలికేలా చేసిందన్నారు అన్నా హజారే.
అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, కేవలం ఆ ముగ్గురి చేతుల్లోనే ఆప్ బందీ అయి పోయిందన్నారు. చివరకు సామాన్యులకు స్థానం లేకుండా పోయిందన్నారు. ఇక ఆప్ ఎలా గెలుస్తుందంటూ ప్రశ్నించారు. తాజాగా ఆప్ పై అన్నా హాజరే చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.