Friday, April 4, 2025
HomeNEWSNATIONALఢిల్లీ పీఠం క‌మ‌లం కైవ‌సం

ఢిల్లీ పీఠం క‌మ‌లం కైవ‌సం

మ్యాజిక్ ఫిగ‌ర్ దిశ‌గా బీజేపీ

ఢిల్లీ – ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో బీజేపీ స‌త్తా చాటుతోంది. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్ ను దాటేసింది. మొత్తం 70 స్థానాల‌కు గ‌నాఉ 38 సీట్ల‌కు పైగా కైవ‌సం చేసుకుంది. గ‌త 10 ఏళ్లుగా దేశ రాజ‌ధానిలో అధికారంలో ఉన్న ఆప్ కు కోలుకోలేని రీతిలో షాక్ త‌గిలింది. అవినీతి ఆరోప‌ణ‌లు, లిక్క‌ర్ స్కామ్, మురుగు నీరు, పేరుకు పోయిన పారిశుధ్యం , త‌దిత‌ర అంశాలు ఆప్ ప‌రాజ‌యం పొందేందుకు కార‌ణ‌మ‌య్యాయి. బీజేపీ అత్య‌ధిక సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది.

ఈసారి ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున మూడు పార్టీలు హామీలు గుప్పించాయి. కానీ ఈసారి ఢిల్లీవాసులు బీజేపీ వైపు మొగ్గు చూపారు. మొత్తం స్థానాల‌కు గాను ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జ‌న‌తా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి 699 మంది అభ్య‌ర్థులు నిలిచారు. ఆప్ ఆశించిన మేర గ‌ట్టి పోటీ ఇవ్వ‌గా కాంగ్రెస్ సీట్ల‌కు సంబంధించి ఇంకా ఖాతా ఓపెన్ చేయ‌లేదు.

మొత్తం మీద ఢిల్లీలో ఆప్ ప‌వ‌ర్ ను కోల్పోయేందుకు ప్ర‌ధాన కార‌ణం ఢిల్లీ లిక్క‌ర్ స్కామేన‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇక బీజేపీ ప్ర‌క‌టించిన డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ పేరుతో చేప‌ట్టిన ప్ర‌చారం ప్ర‌జ‌ల‌ను ఎక్కువ‌గా ప్ర‌భావితం అయ్యేలా చేశాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments