29న పీఎం అనర్హత వేటుపై విచారణ
హిందూ..సిక్కు దేవతల పేరుతో రాజకీయం
న్యూఢిల్లీ – హిందూ, సిక్కు దేవతల పేరు చెప్పి ఓట్లు అడిగారన్న దానిపై ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ పై పిటిషన్ దాఖలైంది ఢిల్లీ కోర్టులో. ఏప్రిల్ 26న శుక్రవారం విచారణ చేపట్టాల్సి ఉండగా అనుకోకుండా విచారణ చేపట్టాల్సిన న్యాయమూర్తి సెలవుపై వెళ్లారు. దీంతో కేసు విచారణను వాయిదా వేసినట్లు ఢిల్లీ కోర్టు వెల్లడించింది.
ఇదిలా ఉండగా కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేయడం పూర్తిగా భారత రాజ్యాంగానికి విరుద్దమని పిటిషన్ లో పేర్కొన్నారు. గత 10 ఏళ్ల కాలంలో మోదీ కేవలం వీటి మీద ఆధారపడి నెట్టుకుంటూ వస్తున్నారని, దీని వల్ల లౌకిక వాదంతో పాటు ప్రజాస్వామ్యం అత్యంత ప్రమాద స్థితిలోకి చేరిందని ఆవేదన చెందారు.
ఇలాగే కంటిన్యూ చేస్తూ పోతే కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఈసీ నిద్ర పోయిందని, అందుకే తాము కోర్టును ఆశ్రయించడం జరిగిందని పిటిషన్ లో పేర్కొన్నారు. హిందూ, సిక్కు దేవతల పేరుతో ఓట్లు వేయాలని మోదీ కోరారని, ఆయనపై ఆరు సంవత్సరాల పాటు అనర్హత వేటు వేయాలని కోరారు. దీంతో ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 29న సోమవారం విచారణకు స్వీకరిస్తామని ఢిల్లీ కోర్టు తెలిపింది.