కవిత జైలుకా లేక ఇంటికా
నన్ను అక్రమంగా ఇరికించారు
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజు రోజుకు కొత్త ట్విస్ట్ లు ఉత్కంఠను రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి దేశ వ్యాప్తంగా సోదాలు చేపట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. ఇప్పటి వరకు కోర్టుకు సమర్పించిన రిపోర్టులో 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది.
ఈ సందర్బంగా తనను అనసరంగా ఇరికించారంటూ సంచలన ఆరోపణలు చేసింది కల్వకుంట్ల కవిత. ఇదే సమయంలో ఇవాళ నాలుగో రోజు విచారణ కొనసాగింది. ఈడీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ప్రధానంగా విచారణ సమయంలో కవితను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. రూ. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించినట్లు టాక్.
తన పేరు లేక పోయినా కొందరు కుట్ర పూరితంగా తనను ఇరికించారంటూ ఆరోపించింది. ఈ మేరకు తన అరెస్ట్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదే సమయంలో భర్త, సోదరుడు, కొడుకు, తల్లిని కలిసేలా పర్మిషన్ ఇవ్వాలని కోరింది. ఇందుకు కోర్టు సమ్మతించింది. మొత్తంగా కేసుకు సంబంధించి చూస్తే ఈనెల 23 తర్వాత తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు వాపోతున్నారు.