ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్
బెయిల్ ఇవ్వడం కుదరదన్న కోర్టు
న్యూఢిల్లీ – భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్నారు. ఆమెతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్ సైతం చెరసాలలో శిక్ష అనుభవిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అడ్డంగా బుక్కై తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్సీ కవిత. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదంటూ వాపోయారు. ఆపై తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు కల్వకుంట్ల కవిత.
ఈ సందర్బంగా ఢిల్లీ కోర్టు విచారణ చేపట్టింది. తనకు ఎందుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలో చెప్పాలని కోరింది కోర్టు. తనను కావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అదుపులోకి తీసుకుందని పేర్కొంది కవిత. ఆమె చెప్పినవన్నీ అబద్దాలేనని, పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, రూ. 100 కోట్లు మడుపులు చెల్లించిందని, ఈమెనే లిక్కర్ క్వీన్ గా వ్యవహరించిందని ఆరోపించింది.
దీంతో కోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. కవితకు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది .