లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కింగ్ పిన్
ఈడీ ఛార్జ్ షీట్ లో ఆప్ పార్టీ పేరు
న్యూఢిల్లీ – కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , సీఎం కేజ్రీవాల్ తో పాటు పార్టీ మొత్తానికి ఇందులో భాగస్వామ్యం ఉందని నివేదికలో పేర్కొననున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇదే గనుక ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్లయితే 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఒక పార్టీ మొత్తాన్ని అవినీతి ఆరోపణల పేరుతో చేర్చడం తొలిసారి అవుతుంది. ఇప్పటికే ఇదే కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట శరత్ చంద్రా రెడ్డి అప్రూవర్ గా మారాడు.
విచిత్రం ఏమిటంటే ఆయనకు బెయిల్ లభించింది. తను భారతీయ జనతా పార్టీకి విరాళంగా ఏకంగా రూ. 60 కోట్లు ఇచ్చాడని ఆప్ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈడీ తన విచారణలో లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ గా పేర్కొంది. ఇదే సమయంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే జైలులో ఊచలు లెక్క బెడుతోంది. ఆమెతో పాటు సిసోడియా, జైన్ కూడా ఉన్నారు.