NEWSNATIONAL

లిక్క‌ర్ కేసులో క‌విత‌..సీఎం కీల‌కం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ

న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో ఊహించ‌ని రీతిలో మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో పాటు ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ల‌ను అరెస్ట్ చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ).

ఇప్ప‌టికే అదుపులోకి తీసుకుని రోస్ ఎవెన్యూ కోర్టులో ప్ర‌వేశ పెట్టారు ఇద్ద‌రినీ. మ‌రో వైపు త‌న‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేశారంటూ , బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. దీనిపై సీరియ‌స్ అయ్యింది సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం.

విచార‌ణ ఎదుర్కొంటున్న నేత‌లు ఎవ‌రైనా స‌రే కింది స్థాయి కోర్టుకు వెళ్లాల‌ని, అక్క‌డే పిటిష‌న్ దాఖ‌లు చేయాల‌ని సూచించింది. బెయిల్ ఇవ్వ‌డం కుద‌రదంటూ స్ప‌ష్ట‌మైన తీర్పు చెప్పింది. దీంతో త‌లుపులు మూసుకున్నాయి.

ఇదే స‌మ‌యంలో క‌విత‌తో పాటు అర‌వింద్ కేజ్రీవాల్ ల‌ను క‌లిసి విచార‌ణ చేప‌ట్టేందుకు త‌మ‌కు క‌స్ట‌డీకి అనుమ‌తి ఇవ్వాల‌ని కోరింది ఈడీ. ఇదిలా ఉండ‌గా తాను జైలు నుంచే పాల‌న సాగిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్.