NEWSNATIONAL

సుప్రీంను ఆశ్ర‌యించిన కేజ్రీవాల్

Share it with your family & friends

స‌వాల్ చేసిన ఢిల్లీ ముఖ్య‌మంత్రి

న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొని అరెస్ట్ అయిన ఆప్ చీఫ్ , సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కేసుకు సంబంధించి విచార‌ణ చేప‌ట్టింది. ఇదిలా ఉండ‌గా త‌న‌ను అక్ర‌మంగా ఈడీ అరెస్ట్ చేసిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కేజ్రీవాల్. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా త‌నను అరెస్ట్ చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్. హైకోర్టు ఇచ్చిన తీర్పు అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్ప‌డ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసు దేశంలో సంచ‌ల‌నం రేపింది. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు 17 మందిని అరెస్ట్ చేసింది ఈడీ. ఇదిలా ఉండ‌గా ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత తో పాటు సీఎం కేజ్రీవాల్ , డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా, మంత్రి స‌త్యేంద్ర జైన్ తో పాటు ఎంపీ సంజ‌య్ సింగ్ ను అదుపులోకి తీసుకుంది.

తాజాగా ఆరు నెల‌ల జైలు జీవితం అనుభ‌వించిన అనంత‌రం మ‌ధ్యంత‌ర బెయిల్ పై విడుద‌ల‌య్యారు సంజ‌య్ సింగ్.