కవితకు షాక్ రిమాండ్ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో
న్యూఢిల్లీ – ఢిల్లీ మద్యం కుంభకోణంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ఆమె కింగ్ పిన్ గా వ్యవహరించిందని, ఈ మొత్తం లిక్కర్ దందా అంతా ఆమె కనుసన్నలలోనే జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. ఇదే సమయంలో తను కోర్టుకు సమర్పించిన నివేదికలో మరిన్ని ఆసక్తికరమైన అంశాలు జోడించింది.
కవిత మామూలు వ్యక్తి కాదని, ఆమెకు అన్నీ తెలిసే ఈ వ్యవహారం జరిగిందని, రూ. 100 కోట్ల ముడుపులు ముట్టాయని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత తరపున లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది కల్వకుంట్ల కవితకు.
ఆమెకు బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదని, ఎందుకంటే కేసును నీరు గార్చేందుకు ప్రయత్నం చేస్తుందని, ఒత్తిళ్లు కూడా తీసుకు వచ్చేలా ప్రయత్నిస్తుందని పేర్కొంది ఈడీ. దీనిపై విశ్వసించిన కోర్టు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చింది. ఇదే కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం విశేషం.