NEWSTELANGANA

క‌విత‌కు షాక్ రిమాండ్ పొడిగింపు

Share it with your family & friends

ఆగ‌స్టు 13వ తేదీ దాకా జ్యుడిషియ‌ల్

ఢిల్లీ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసుకు సంబంధించి ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌డం కుద‌ర‌ని తేల్చి చెప్పింది కోర్టు. ఇదే స‌మ‌యంలో బుధ‌వారం ఈ కేసుపై విచార‌ణ చేప‌ట్టింది కోర్టు.

ఈడీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ క‌విత‌కు జ్యుడిషియ‌ల్ రిమాండ్ ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది . ఈ మేర‌కు ఆగ‌స్టు 13వ తేదీ వ‌ర‌కు రిమాండ్ పొడిగిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా క‌ల్వ‌కుంట్ల క‌విత కోట్లాది రూపాయ‌లతో అక్ర‌మంగా మ‌ద్యం వ్యాపారం నిర్వ‌హించార‌ని , అందుకే అరెస్ట్ చేయ‌డం జ‌రిగింద‌ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి నివేదిక స‌మ‌ర్పించింది.

దీనిపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ క‌విత‌. రాజ‌కీయంగా త‌న తండ్రి , మాజీ సీఎం కేసీఆర్ ను ఎదుర్కోలేకనే మోడీ ప్ర‌భుత్వం త‌న‌పై క‌క్ష క‌ట్టింద‌ని ఆరోపించారు. ఏదో ఒక రోజు తాను నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌లు మోడీ , బీజేపీ క‌క్ష పూరిత పాలిటిక్స్ ను గ‌మ‌నిస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు.