NEWSNATIONAL

సీఎం కేజ్రీవాల్ క‌స్ట‌డీ పొడిగింపు

Share it with your family & friends

జూలై 25 వ‌ర‌కు జైలు లోనే

న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కు సంబంధించిన కేసుపై శుక్ర‌వారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఇందులో భాగంగా ఇవాళ కీల‌క‌మైన తీర్పు చెప్పింది. అర‌వింద్ కేజ్రీవాల్ కు క‌స్ట‌డీ పొడిగించింది. జూలై 25 వ‌ర‌కు క‌స్ట‌డీ ఇస్తున్న‌ట్లు పేర్కొంది.

ఇదిలా ఉండ‌గా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. త‌న అరెస్ట్ అక్ర‌మ‌మ‌ని, త‌న‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. త‌న భ‌ర్త అమాయ‌కుడ‌ని, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు దాడులు చేసినా, సోదాలు చేసినా ఒక్క పైసా కూడా దొర‌క‌లేద‌ని వాపోయింది సునీతా కేజ్రీవాల్.

ఈ కేసులో మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌స్తుతం జైలులో ఉన్నారు. త‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరినా ఫ‌లితం లేకుండా పోయింది. త‌మ‌ను రాజ‌కీయంగా క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ వాపోయారు.

కావాల‌ని పీఎం మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కుట్ర‌లు ప‌న్ని త‌మ‌ను అరెస్ట్ చేయించారంటూ ఆరోపించారు.