కేజ్రీవాల్ పీఏపై కేసు నమోదు
పీఏ దాడి చేశాడంటూ ఆరోపణ
న్యూఢిల్లీ – ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కుని తీహార్ జైలు పాలై మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఇదిలా ఉండగా ఢిల్లీ విమెన్స్ కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న స్వాతి మలివాల్ పై సీఎం నివాసంలో వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న బిభవ్ కుమార్ దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. బాధితురాలు స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సీఎం పీఏ బిభవ్ కుమార్ తన ముఖంపై ఐదారు సార్లు చెప్పుతో కొట్టాడని, ఛాతి, కడుపు , దిగువ భాగాలపై కొట్టాడని ఆరోపించింది. ఇంట్లో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నప్పటికీ పట్టించు కోలేదని, చూసీ చూడనట్టు వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పీఏపై 354, 506, 509, 323 సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. స్వాతి మలివాల్ ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని ఎయిమ్స్ లో పరీక్షలు చేపట్టారు.