Monday, April 21, 2025
HomeNEWSరేవంత్ కు ఢిల్లీ పోలీస్ స‌మ‌న్లు

రేవంత్ కు ఢిల్లీ పోలీస్ స‌మ‌న్లు

షాక్ కు గురైన రాష్ట్ర ముఖ్య‌మంత్రి

హైద‌రాబాద్ – రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు సంబంధించి ఫేక్ వీడియోను షేర్ చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఢిల్లీ పోలీసులు సీఎంకు స‌మ‌న్లు జారీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్ట‌ర్ లో హోం మంత్రికి చెందిన 17 సెకన్ల వీడియోను పంచుకుంది. ఇందులో అమిత్ షా ఎస్సీ, ఎస్టీల‌కు ఇచ్చిన రాజ్యాంగ ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని చెప్ప‌డాన్ని ప్ర‌త్యేకంగా ఇందులో ఉంది. దీనిని షేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ.

ఇందులో ఎస్సీ, ఎస్టీలే కాదు ఓబీసీలు కూడా ఉన్నారు. గ‌త ఏడాది 23 ఏప్రిల్ నెల‌లో చేవెళ్ల వేదిక‌గా ప్ర‌సంగించారు అమిత్ షా. బీజేపీకి ఓటు వేస్తే రాష్ట్రంలో రాజ్యాంగ ప‌రంగా అమ‌లు చేస్తున్న ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తామ‌న్నారు. తెలంగాణ లోని ఎస్సీల‌కు కూడా చెందుతుంద‌ని ప్ర‌క‌టించారు.

ఈ వీడియోను డిజిట‌ల్ గా మార్చి కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. ఈ విష‌యంపై తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ పై బీజేపీ ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ యూజ‌ర్లు స‌ర్కులేట్ చేసిన వీడియోల‌ను కూడా గుర్తించిన‌ట్లు తెలిపింది.

ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ పోలీస్ ఐటీ చట్టంలోని 153/153A/465/469/171G, 66C సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments