కేజ్రీవాల్ పై ఢిల్లీ కోర్టు కన్నెర్ర
ఎందుకుని హాజరు కావడం లేదు
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ చీఫ్ , ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఢిల్లీ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు ఒక్క నోటీసుకు కూడా సమాధానం ఇవ్వలేదు. పైగా కోర్టును ఆశ్రయించడంపై మండిపడింది కోర్టు.
ఒక బాధ్యత కలిగిన సీఎం పదవిలో ఉన్న కేజ్రీవాల్ ఇలా వ్యవహరించడం మంచి పద్దతి కాదని పేర్కొంది. అసలు హాజరు కాక పోవడానికి గల కారణాలు ఏమిటో చెప్పాలని నిలదీసింది కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని.
ఈడీ ముందుకు ఎందుకు హాజరు కావడం లేదు. దానికి గల కారణాలు ఏమిటో చెప్పగలరా అని ఘాటుగా ప్రశ్నించింది. అయితే న్యాయవాది సమాధానం ఇస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థను ఎదుర్కొనేందుకు తమ కక్షిదారు సీఎం కేజ్రీవాల్ రెడీగా ఉన్నారని స్పష్టం చేశారు.
అయితే ఆయనకు రక్షణ అవసరమని, ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేయాలని కోరారు.