కోలుకోలేని షాక్ ఇచ్చిన హైడ్రా
హైదరాబాద్ – హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజధానిలో ఆక్రమణలకు, కబ్జాలకు పాల్పడిన ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే వసంత కుమార్ కు షాక్ ఇచ్చింది. వేల కోట్ల విలువైన భూములను రక్షించింది. ఆక్రమణలో ఉన్న భూములలో నిర్మాణాలను తొలగించింది. హైడ్రా చర్యలతో రెండు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఏ పార్టీకి చెందిన వారైనా, ఏ రంగంలో ఉన్నా, ఎంతటి ప్రముఖులైనా సరే కబ్జాలకు పాల్పడితే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హఫీజ్ పేట్ పరిధిలోని పదిహేడు ఎకరాలలో ప్రభుత్వ భూములలో ఉన్న ఆక్రమణల కూల్చి వేశారు. అన్ని వైపులా ఒత్తిడులను అధిగమిస్తూ ముందుకు సాగారు.
మరోవైపు హైడ్రా వల్ల తమకు మేలు జరిగిందని , హైడ్రా జిందాబాద్ అంటూ స్వీట్లు పంచుకున్నారు ఇంజాపూర్ కాలనీవాసులు. ఈ సందర్బంగా వనస్థలిపురం ఇంజాపూర్ రోడ్డు ఆక్రమణలను కూల్చివేసి రోడ్డు క్లియర్ చేశారు. హైడ్రా చర్యలతో 7 కాలనీలకు కలిగిన విముక్తి కలిగింది. ఈ సందర్బంగా ఆక్రమణల కూల్చివేతలపై స్పందించారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. 2005లో తాము ఈ భూమిని కొనుగోలు చేశామన్నారు. ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ రంగారెడ్డి కలెక్టర్ ఎన్ఓసీ ఇచ్చారన్నారు. హైడ్రా కమిషనర్ ను కలిసి పత్రాలు కూడా ఇచ్చామన్నారు. అయినా కూల్చి వేశారంటూ ఆరోపించారు.