దీపేందర్ హూడా భావోద్వేగం
భారీ తేడాతో గ్రాండ్ విక్టరీ
న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీకి చెందిన దీపేందర్ హూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. తన విజయాన్ని తట్టుకోలేక బావురుమన్నాడు. లోక్ సభ ఎన్నికల సందర్బంగా ఫలితాలు వెల్లడి అయ్యాయి.
గతంలో 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కేవలం 5,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. కానీ ఎక్కడా నిరాశకు గురి కాలేదు. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఏకి పారేస్తూ వచ్చారు. మొత్తంగా ప్రజల మధ్యనే ఉన్నాడు. వారి వాయిస్ ను వినిపిస్తూ వచ్చారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ వచ్చారు.
ఇదిలా ఉండగా ఈసారి 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీ మెజారిటీని కట్టబెట్టారు ప్రజలు. ఏకంగా భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థిపై 3,50,000 లక్షల ఓట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేశారు.
ఈ విజయంతో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దీపేందర్ సింగ్ హూడాకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.