డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్ – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులకు ఆమోదం తెలపాలని, నిధులను మంజూరు చేయాలని కోరారు. మంత్రికి వినతిపత్రం సమర్పించారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన ఆరు హామీలకు ప్రయారిటీ ఇస్తున్నామని తెలిపారు.
తమ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తోందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబఃధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం, అనుమతులు ఇప్పించేందుకు సహాయ సహకారం అందించాలని కోరారు.
ప్రభుత్వం సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు డిప్యూటీ సీఎం. గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టడం జరిగిందన్నారు. ప్రాధాన్యత క్రమంలో ఫోకస్ పెట్టడం జరిగిందని చెప్పారు మల్లు భట్టి విక్రమార్క.