మురుడేశ్వర్ బీచ్ లో డీకే దంపతులు
సముద్రానికి నీరసాన్ని దూరం చేసే శక్తి
కర్ణాటక – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు తన సతీమణి ఉషతో కలిసి రాష్ట్రంలో అత్యంత పేరు పొందిన మురుడేశ్వర్ బీచ్ వద్దకు వెళ్లారు. అక్కడ ఇద్దరు కొంత సేపు విడిది చేశారు. ఈ సందర్బంగా తన ఆలోచనలను పంచుకున్నారు డీకే శివకుమార్.
శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రతి ఏటా మురుడేశ్వర్ బీచ్ (సముద్రం) ను సందర్శించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం. ఇదే సమయంలో సముద్రాన్ని చూడడం, సందర్శించడం వల్ల శరీరం కొంత అలసట నుంచి ఉపశమనం కలుగుతందని పేర్కొన్నారు.
ఇదే సమయంలో అలసట నుంచి దూరం చేస్తుందని, అంతే కాకుండా నీరసం నుంచి చైతన్యవంతం చేసేలా ఈ బీచ్ ఎల్లప్పుడూ చేస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు డీకే శివకుమార్. ఇవాళ మురుడేశ్వర్ బీచ్ ను సందర్శించడం జీవితంలో మరిచి పోలేనని పేర్కొన్నారు.
తన సతీమణి ఉషతో మురుడేశ్వర్ ను సందర్శించడం సంతోషాన్ని కలిగించిందని స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రి. బీచ్ లో గడిపిన తర్వాత కొంత ప్రశాంతత లభించిందని తెలిపారు.