ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో అత్యంత ప్రసిద్ది చెందిన దేవాలయంగా, వీసాల దేవుడిగా పేరు పొందిన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్, ఆయన తండ్రి సౌందర రాజన్ పై ఇటీవల కొందరు దాడికి పాల్పడ్డారు. రామరాజ్యం సంస్థకు చెందిన వారిగా ప్రకటించారు. కోర్టులపై కూడా అనుచిత కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
ఇదిలా ఉండగా చిలుకూరు బాలాజీ ఆలయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. పెద్ద ఎత్తున ధార్మిక, హిందూ సంస్థలు ఖండించాయి. ఘటనపై స్పందించారు పవన్ కళ్యాణ్. ఆయన ఇప్పటికే సనాతన ధర్మ పరిరక్షణ కోసం తాను కట్టుబడి ఉన్నానంటూ తిరుమల పుణ్య క్షేత్రం వేదికగా ప్రకటించారు. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ తరుణంలో చిలుకూరు ఆలయ ప్రధాన పూజారి , తండ్రిపై దాడి చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఇది తనపై జరిగిన దాడి కాదని యావత్ హిందూ ధర్మంపై జరిగిన దాడిగా డిప్యూటీ సీఎం అభివర్ణించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇదే క్రమంలో తెలంగాణ సర్కార్ వెంటనే విచారణ చేపట్టాలని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.