దేవర దావుడి సాంగ్ సింగిల్ వైరల్
3వ సింగిల్ రిలీజ్ చేయనున్న యూనిట్
హైదరాబాద్ – డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాహ్నవి కపూర్ నటించిన దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, సింగిల్స్ , ప్రోమోకు భారీ ఎత్తున ఆదరణ లభించింది.
తాజాగా దేవర చిత్రానికి సంబంధించి దేవర చిత్ర యూనిట్ కీలక ప్రకటన చేసింది. దావుడి సాంగ్ సింగిల్ ప్రోమోను ఈనెల 4న బుధవారం రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు దేవరను.
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తో పాటు సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను రూ. 120 కోట్లు ఖర్చు పెట్టి తీసినట్లు సమాచారం. ఆర్ రత్నవేలు ఛాయాగ్రహణం అందించగా అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు దేవర మూవీ కోసం.