ENTERTAINMENT

జూనియ‌ర్ ఎన్టీఆర్ వ‌న్ మేన్ షో

Share it with your family & friends

డైన‌మిక్ డైరెక్ట‌ర్ మార్క్ మూవీపై

హైద‌రాబాద్ – జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. త‌ను దమ్మున్న న‌టుడు. అద్భుత‌మైన పాత్ర‌కు న్యాయం చేయ‌డంలో త‌న‌కు త‌నే సాటి. తండ్రీ కొడుకులుగా పోటీ ప‌డి న‌టించారు దేవ‌ర‌లో. డైన‌మిక్ డైరెక్ట‌ర్ గా పేరు పొందిన కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

మేకింగ్ లో ప్ర‌త్యేక‌త‌ను చాటుకునే ప్ర‌య‌త్నం చేశాడు మ‌రోసారి కొర‌టాల శివ‌. త‌ను మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య తీశాడు. అది బాక్సాఫీసు వ‌ద్ద బోల్తా ప‌డింది. ఆశించిన మేర ఆడ‌లేదు. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్, పూజా హెగ్డే లాంటి నటులు న‌టించినా వ‌ర్క‌వుట్ కాలేదు.

క‌థ‌లో ద‌మ్ముంటేనే సినిమాను ఆద‌రిస్తార‌ని తేలి పోయింది ఆచార్య‌తో. దీంతో కొర‌టాల శివ‌తో సినిమా తీసేందుకు ముందుకు రాలేదు. కానీ ఇచ్చిన మాట ప్ర‌కారం జూనియ‌ర్ ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చాడు డైరెక్ట‌ర్ కు.

త‌న‌లోని క‌సిని మ‌రోసారి తెర‌పై చూపించే ప్ర‌య‌త్నం చేశాడు డైరెక్ట‌ర్. మంగళ‌వారం భారీ అంచ‌నాల మ‌ధ్య దేవ‌ర ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. అద్భుత‌మైన పోరాట స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్ అన్నీ తానై న‌డిపించాడ‌ని తేలి పోయింది. మొత్తంగా సెప్టెంబ‌ర్ 27న దేవ‌ర రిలీజ్ కోసం అభిమానులు ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు.

ఓవ‌ర్సీస్ లో ఇప్ప‌టికే 11 ల‌క్ష‌ల‌కు పైగా టికెట్లు అమ్ముడు పోయిన‌ట్లు టాక్.