దేవర మూవీ పైసా వసూల్ పక్కా
ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్
హైదరాబాద్ – డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర మూవీ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న శుక్రవారం విడుదల కానుంది. ఇదిలా ఉండగా అమెరికాలో ప్రిమీయర్ షో ప్రదర్శించారు. భారీ ఎత్తున ఆదరణ లభిస్తున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున రెస్సాన్స్ రావడంతో దేవర టీం ఖుష్ లో ఉంది.
దేవర చిత్రంలో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు అందాల ముద్దుగుమ్మ జాహ్నవి కపూర్ కీలకమైన పాత్రలలో నటించారు. వీరితో పాటు హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో కీలకమైన పాత్ర పోషించాడు.
ఇక తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ప్రస్తుతం తారక్ ఫ్యాన్స్ సంబురాలలో మునిగి పోయారు. ఎక్కడ చూసినా తారక్ కటౌట్లే అగుపిస్తున్నాయి.
దేవర సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. అందుకే తన సోదరుడు కూడా ఇందులో పెట్టుబడి పెట్టడం విశేషం. కథ నచ్చడంతో ఒప్పుకున్నాడు తారక్. ఇక చిరంజీవి, చరణ్ తో తీసిన కొరటాల శివ ఆచార్య అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో ఈ సినిమాపై కూడా ట్రోల్స్ చేశారు. కానీ వాటన్నింటిని దాటుకుని దేవర ఇప్పుడు దూసుకు పోవడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.