దేవర మూవీ బిగ్ సక్సెస్ – మూవీ టీమ్
ఆనందం వ్యక్తం చేసిన శివ..దిల్ రాజు
హైదరాబాద్ – డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాహ్నవి కపూర్ , సైఫ్ అలీ ఖాన్ , ప్రకాశ్ రాజ్ , శ్రీకాంత్ , తదితరులు నటించిన దేవర చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న శుక్రవారం విడుదలైంది. ఈ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని అభిమానులు అనుకున్న దానికంటే ఆదరించారు. అంతే కాదు ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మనసు పెట్టి నటించాడు దేవర చిత్రంలో.
దేవర మూవీ విజయవంతం కావడంతో మూవీ టీం సక్సెస్ మీట్ నిర్వహించింది హైదరాబాద్ లో. ఈ సందర్బంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ సినిమా సక్సెస్ వెనుక కీలకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు. ప్రధానంగా నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా తనకు సహకరించారని చెప్పారు.
నిర్మాతల్లో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ పేరు పేరునా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రధానంగా రత్నవేలు గత 2 ఏళ్లుగా తమతో జర్నీ చేశారని అన్నారు. ఇక దిల్ రాజు మాట్లాడుతూ శివ దమ్మున్న డైరెక్టర్ అంటూ కితాబు ఇచ్చారు. ఇక సినిమా మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్ తానే అయి నడిపించాడని, ఈ క్రెడిట్ ఆయనకే దక్కుతుందన్నాడు. ఈ సక్సెస్ మీట్ లో నిర్మాతలు మిక్కిలేని సుధాకర్ , హరికృష్ణ పాల్గొన్నారు.