మరాఠా సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం
డిప్యూటీ సీఎంలుగా షిండే..పవార్
మహారాష్ట్ర – ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు అంతా అనుకున్నట్టుగానే సస్పెన్స్ కు పుల్ స్టాప్ పెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ట్రబుల్ షూటర్ అమిత్ చంద్ర షా. ఈ మేరకు చివరకు షిండే, పవార్ లను కూల్ చేశారు. అనుకున్నట్టుగానే బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎంగా ఛాన్స్ ఇచ్చేలా చూశారు. ఇందులో కీలకమైన పాత్ర పోషించారు పీఎం.
మరాఠా శాసన సభ ఎన్నికలు జరిగి 10 రోజులు పూర్తయ్యాయి. అయినా సర్కార్ గా కొలువు తీరక పోవడంతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్ చేశారు. అప్రజాస్వామికంగా గెలుపొందారంటూ ఆరోపించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలుపొందారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇదే సమయంలో ఆపద్దర్మ సీఎంగా ఉన్న షిండే తాను కూడా సీఎం రేసులో ఉన్నానంటూ ప్రకటించారు. దీంతో గందరగోళం నెలకొంది. ఈ తరుణంలో మరోసారి రంగంలోకి దిగారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఏం మంత్రం వేశారో తెలియదు కానీ ఉప ముఖ్యమంత్రులుగా కొలువు తీరేందుకు ఓకే చెప్పారు.
గురువారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా షిండే, పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పీఎం మోడీ. ముకేశ్ అంబానీ, సచిన్ టెండూల్కర్ తో పాటు బాలీవుడ్ నటులు షారుక్ కాన్, సల్మాన్ ఖాన్, రణ్ బీర్ కపూర్, రణ వీర్ సింగ్ పాల్గొన్నారు.