వైసీపీ సీనియర్ నేత దేవినేని అవినాష్
విజయవాడ – కొండచరియలు జారిపడిన ఘటనలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి 10 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు వైసీపీ సీనియర్ నేత దేవినేని అవినాష్.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తోందన్నారు. మొగల్రాజపురం సున్నబట్టీల సెంటర్ వద్ద గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి..
ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.. సమాచారం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, 5వ డివిజన్ కార్పొరేటర్ కలపాల అంబెడ్కర్ కూడా ఆ కుటుంబాలను ఓదార్చారు.. అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు.
ప్రజా ప్రతినిధుల అలసత్వం వల్లనే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వర్షాలు పడుతాయన్న సమాచారం ఉన్నప్పటికీ అధికార పక్ష నేతలు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు.
గతంలో ఇంతకన్నా ఎక్కువ వర్షాలు పడినా ఎటువంటి ఘటనలు జరగలేదని అన్నారు దేవినేని అవినాష్.