ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు
వైసీజీ ఎన్టీఆర్ జిల్లా చీఫ్ అవినాష్
విజయవాడ – భారత దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో గట్టెక్కించిన ఆర్థికరంగ నిపుణుడు , అరుదైన రాజకీయవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ దేశపు పరువు పోకుండా కాపాడిన గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నామని తెలిపారు దేవినేని అవినాష్. మన్మోహన్ సింగ్ వయసు 92 ఏళ్లు. ఆద్యంతమూ వివాద రహితుడిగా పేరు పొందారు. పదేళ్ల పాటు పీఎంగా పని చేశారు. ఆర్థిక మంత్రిగా చెరగని ముద్ర వేశారు. సుదీర్ఘ కాలం పాటు పని చేసిన ప్రధానమంత్రులలో ఆయన కూడా ఒకరు.
తన కెరీర్ లో ఎన్నో ఉన్నతమైన పదవులు నిర్వహించారు. ప్రపంచంలో అత్యున్నతమైన ఆర్థికవేత్తలలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నారు. 1982-1985 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. రాజ్య సభ సభ్యుడిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా తన పాత్ర నిర్వహించారు డాక్టర్ మన్మోహన్ సింగ్.