రెడ్ బుక్ పాలన అవినాష్ ఆవేదన
ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తారా
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని సంచలన ఆరోపణలు చేశారు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్బంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పారని, ప్రస్తుతం అదే జరుగుతోందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
కేవలం కక్ష సాధింపుతోనే అరెస్టులు, కేసులు, దారుణాలు చోటు చేసుకుంటున్నాయని వాపోయారు దేవినేని అవినాష్. ఎటువంటి విచారణ లేకుండా అన్యాయంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కూటమి సర్కార్ వ్యవహరిస్తోందని ఆరోపించారు.
తమ పార్టీ తప్పకుండా జోగి కుటుంబానికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కేసులు నమోదు చేయడం వల్ల తాము ఏమీ భయాందోళనకు గురి కామన్నారు అవినాష్. ఆధారాలు లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. ఇదంతా కావాలని చేస్తున్నది తప్ప ఇంకోటి కాదన్నారు .