Tuesday, April 22, 2025
HomeNEWSANDHRA PRADESHదేవినేని ఉమ‌..టీడీపీ నేత‌ల‌పై కేసు కొట్టివేత

దేవినేని ఉమ‌..టీడీపీ నేత‌ల‌పై కేసు కొట్టివేత

29 మంది సాక్షుల‌ను విచారించిన కోర్టు
విజ‌య‌వాడ – వైసీపీ హ‌యాంలో దేవినేని ఉమ‌తో పాటు టీడీపీ నేత‌ల‌పై న‌మోదైన కేసును కొట్టి వేసింది విజ‌య‌వాడ చీఫ్ మెట్రోపాలిన్ కోర్టు. జ‌క్కంపూడి వ‌ద్ద అక్ర‌మ మైనింగ్ ను ప‌రిశీలించేందుకు వెళ్లిన వారిపై అప్ప‌ట్లో కేసు న‌మోదు చేసింది. ఈ కేసులో 29 మంది మంది సాక్షుల‌ను విచారించింది. దేవినేని ఉమ త‌ర‌పున లాయ‌ర్ ల‌క్ష్మీ నారాయ‌ణ వాద‌న‌లు వినిపించారు.

ఇదిలా ఉండ‌గా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం షాబాద జక్కంపూడి టిడ్కో ఇళ్ళ సమీపంలో గత వైసిపి ప్రభుత్వం హయాంలో వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమ మైనింగ్ పరిశీలించడానికి వెళ్లిన సమయంలో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తో పాటు టిడిపి నేతలపై అక్రమ కేసులు బనాయించారు.

విచారణ నిమిత్తం విజయవాడ ముఖ్య మెజిస్ట్రేట్ లో కేసుకు హాజరైన దేవినేని ఉమాతో పాటు టిడిపి నేతలకు భారీ ఊరట లభించింది. దేవినేని ఉమ స్పందించారు. త‌న‌తో పాటు ఇత‌ర రైతుల‌పై అక్ర‌మంగా కేసులు న‌మోదు చేశార‌ని వాపోయారు. ప‌ని చేసుకునే వారంతా గ‌త నాలుగేళ్లుగా కోర్టు చుట్టూ తిరిగార‌ని అన్నారు. ఇవాళ మొత్తం సాక్షుల‌ను న్యాయ‌మూర్తి విచారించార‌ని , కేసు కొట్టివేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశార‌ని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments