ప్రశంసించిన టీటీడీ చైర్మన్
తిరుమల – తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. భక్తులను స్వయంగా కలిసి ఏర్పాట్లు, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు, ఏఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీర బ్రహ్మం. భక్తులకు అన్న ప్రసాదం, తాగు నీరు, పానియాలు, బిస్కెట్లు, టిఫిన్లు అందజేశారు. ఈ సందర్బంగా టీటీడీ అధికారులను అభినందించారు చైర్మన్.
ఇదిలా ఉండగా రథసప్తమికి సంబంధించి సప్త వాహనాలలో శ్రీ మలయప్ప స్వామి వైభవాన్ని వీక్షించడానికి భక్తులు పోటెత్తారు. గ్యాలరీలన్నీ నిండి పోయాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి నీడ, రక్షణ కల్పించే జర్మన్ షెడ్‌లను ఏర్పాటు చేశారు.
మధురై నుండి చింతామణి, రాణిపేట నుండి చెన్నమ్మాళ్, కోయంబత్తూర్ నుండి దేవకి, కర్ణాటకలోని ములాబాగుల్ నుండి బసవన్న, ముంబై నుండి అనుజ్, వైజాగ్ నుండి సులోచన, నెల్లూరు నుండి విజయలక్ష్మి, తిరుపతి నుండి విజయ అందరూ ఉదయం నుండి సాయంత్రం వాహనములు పూర్తయ్యే వరకు భక్తులకు వివిధ రకాల అన్నప్రసాదాలను అందిస్తున్నందుకు టిటిడిని ప్రశంసించారు.
భద్రతా చర్యలతో పాటు పారిశుధ్యం, పరిశుభ్రతకు భక్తుల నుండి భారీ ప్రశంసలు లభించాయి. టాయిలెట్లు సంపూర్ణంగా నిర్వహించ బడుతున్నాయి. వాహన సేవలు పూర్తయ్యేంత వరకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు భక్తులు.