కేసీఆర్ ను కలిసిన వనం..అమర్
పుస్తకాలను అందజేత
హైదరాబాద్ – ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ , మాజీ సీఎం సీపీఆర్ఓ వనం జ్వాలా నరసింహారావు మర్యాద పూర్వకంగా మాజీ సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. హైదరాబాద్ లోని నంది హిల్స్ లో ఉంటున్న మాజీ సీఎం ఇంటికి వెళ్లారు. దేవులపల్లి అమర్ ఇటీవలే మూడు దారులు పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. దీంతో పాటు వనం కూడా తాను రాసిన కొత్త పుస్తకాన్ని స్వయంగా కేసీఆర్ కు అందజేశారు.
ఈ సందర్బంగా కేసీఆర్ చాలా సేపు వీరిద్దరితో చర్చించారు. దేశ, రాష్ట్ర రాజకీయాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇదిలా ఉండగా వనం, అమర్ ఇద్దరూ పేరు పొందిన జర్నలిస్టులు. సమ కాలీన రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారు.
ఇదిలా ఉండగా మాజీ సీఎం కేసీఆర్ కు పుస్తకాలంటే అభిమానం. ఆయన రోజూ ఒక పుస్తకాన్ని చదువుతారు. తెలియని విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా తనను కలుసుకుని పుస్తకాలను అందజేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు మాజీ సీఎం.
భవిష్యత్తులో తాను కూడా రాసే ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు కేసీఆర్. వనం జ్వాలా నరసింహారావు, దేవులపల్లి అమర్ ను అభినందించారు.